News March 24, 2025
జియ్యమ్మవలస: ఏనుగుల గుంపు సంచారం

జియ్యమ్మవలస మండలంలోని ఎరుకుల పేట గ్రామ పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం చెరుకు, అరటి తోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉంటూ ప్రయాణం చేయాలన్నారు. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
Similar News
News November 9, 2025
KNR: కాంగ్రెస్‌లో అయెమయం.. నేతల మధ్య విబేధాలు

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అయోమయం మొదలైంది. నాయకుల మధ్య విభేదాలు, అగ్రశ్రేణి న్యాయకత్వం వద్ద సమన్వయం లేకపోవడంతో ఇటీవల కరీంనగర్లో జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఓటమిపాలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరాల కోసం పార్టీలో చేరిన నాయకులు ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. దీంతో పార్టీని పట్టుకుని ఉన్న పాత కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
News November 9, 2025
బై పోల్.. ప్రచారానికి నేడే ఆఖరు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు మైకులు, ప్రచార రథాలు మూగబోనున్నాయి. ప్రచార గడువు ముగియనుండటంతో ఆయా పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై పదునైన మాటల తూటాలు సంధిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఇవాళ సా.6 నుంచి ఈ నెల 11(పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు నియోజకవర్గంలో వైన్స్ మూసివేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశించారు.
News November 9, 2025
13 ఏళ్లుగా HYDలో వేములవాడ రాజన్న కళ్యాణం

ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం శనివారం HYDలోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా గత 13 సంవత్సరాలుగా ఏటా రాజరాజేశ్వర స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని హైదరాబాదులో ఘనంగా జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. ఆలయ ఈవో, CM పాల్గొన్నారు.


