News March 24, 2025
నల్గొండ: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. HYDకి చెందిన ఉదయ్‌కిరణ్ నేరేడుగొమ్ము మండలం పుష్కర ఘాట్‌లో మునిగి చనిపోయాడు. నల్గొండ మండలానికి చెందిన నవీన్ కుమార్, రాఘవేంద్ర ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. సూర్యాపేట జిల్లాలోని బీబీగూడెంలో కారు, బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.
Similar News
News March 30, 2025
నేడు సన్నబియ్యం పథకం ప్రారంభం.. ఫస్ట్ వీరికే!

రాష్ట్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్నగర్ వేదికగా CM రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొదటగా పట్టణంలోని రేషన్ కార్డుదారులు ధరావత్ బుజ్జీ, కర్ల రాధ, రజిత, సుశీల, షేక్ కరీమా, మమత, సుగుణ, కర్నా వెంకటపుష్ప, సరికొండ ఉమ, మండల పరిధిలోని చడపండు లక్ష్మి, భరతం కుమారి, కర్పూరపు లక్ష్మి, మాళోతు రంగా, గుండెబోయిన గురవయ్య, షేక్ రహిమాన్‌కు CM రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.
News March 30, 2025
నేడు జిల్లాకు సీఎం.. షెడ్యూల్ ఇదే!

నేడు హుజూర్‌నగర్‌కు CM రేవంత్ రెడ్డి రానున్న విషయం తెలిసిందే. కాగా, షెడ్యూల్ ఇలా ఉంది.
☞5:00PM బేగంపేట ఏయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో రాక
☞5:45PM హుజూర్నగర్ రామస్వామిగుట్ట వద్ద ల్యాండ్
☞5:45PM-6:05PM స్థానికంగా 2000 సింగిల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలన
☞6:15PM హుజూర్నగర్ బహిరంగ సభలో ప్రసంగం
☞6:15PM-7:30PM వరకు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం
☞7:30PM తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు ప్రయాణం
News March 30, 2025
నల్గొండ: బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.

బ్యాంక్ ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అవుతున్న బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని కారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ శిక్షణను ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 8 వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.