News March 24, 2025

రాజమండ్రి: వేరొకరితో చాటింగ్..అందుకే మర్డర్ చేశాడా?

image

హుకుంపేటలో ఆదివారం జరిగిన తల్లి కూతుళ్ల డబుల్ మర్డర్ కేసు తూ.గో జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ హత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలు సానియా, శివకుమార్‌కు ఓ ఈవెంట్లో పరిచయం ఏర్పడింది. కాగా ఆ యువతి మరొకరితో చాటింగ్ చేయడాన్ని సహించని శివకుమార్..పథకం ప్రకారం ఆ యువతితో పాటు తల్లిని కూడా హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Similar News

News November 5, 2025

గిరిజనులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు: చిత్తూరు కలెక్టర్

image

జిల్లాలోని 411 మంది గిరిజనులకు నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దీపం-2 పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీ కాలనీలలో ప్రతి ఇంటిని సందర్శించి అర్హతలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

News November 5, 2025

సిక్కుల ఆరాధ్య దైవం మన గుంటూరు వచ్చారని తెలుసా?

image

గుంటూరు జిల్లాలో సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్‌ సందర్శించిన ప్రదేశంగా ‘గురుద్వారా పెహ్లీ పాట్షాహీ’ గుర్తింపు పొందింది. రెండవ ఉదాసి (1506–1513) కాలంలో గురునానక్‌ దక్షిణ భారత పర్యటనలో గుంటూరును సందర్శించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆయన ప్రసంగాలతో ప్రభావితమై ఏర్పడిన ఈ గురుద్వారా ఆధ్యాత్మిక చరిత్రలో ముఖ్య స్థావరంగా నిలిచింది. 19వ శతాబ్దంలో తీర్థయాత్రికులు ఈ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేశారు.

News November 5, 2025

ఫ్రీ బస్సు హామీ.. న్యూయార్క్‌లో విజయం

image

న్యూయార్క్ (అమెరికా) మేయర్‌గా <<18202940>>మమ్‌దానీ గెలవడంలో<<>> ఉచిత సిటీ బస్సు ప్రయాణ హామీ కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బస్ లేన్స్, వేగం పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. వాటితో పాటు సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు పెంచి ఉద్యోగులపై ట్యాక్సులను తగ్గిస్తామని చెప్పారు. నగరంలో ఇంటి అద్దెలను కంట్రోల్ చేస్తామని హామీ ఇవ్వడం ఓటర్లను ఆకర్షించింది.