News March 24, 2025
ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు

TG: 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లకు 5 చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నాటికి వీటిని స్కూళ్లలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈనెల 15 నుంచి ప్రయోగాత్మకంగా 513 స్కూళ్లలో AI టూల్స్‌ను వినియోగిస్తూ ఇంగ్లిష్, మ్యాథ్స్ పాఠాలను బోధిస్తున్నారు. 25-26 విద్యా సంవత్సరంలో మరిన్ని స్కూళ్లలో దీనిని అమలు చేయనున్నారు.
Similar News
News March 29, 2025
ఈ విక్టరీ చాలా స్పెషల్ గురూ!

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో CSKపై RCB దాదాపు 17 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఈ గ్రౌండ్‌లో చివరిసారిగా 2008లో చెన్నైను ఓడించిన బెంగళూరు.. మళ్లీ 6,155 రోజుల తర్వాత ఇప్పుడు గెలుపును నమోదు చేసింది. అందుకే ఈ విజయం RCBకి చాలా స్పెషల్. ఈ సీజన్‌లో పాటీదార్ సేనకు ఇది రెండో విజయం. 4 పాయింట్లతో ఆ జట్టు ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉంది. ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగించి ఛాంపియన్‌గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News March 29, 2025
మా ఓటమికి అదే కారణం: రుతురాజ్

RCBతో మ్యాచులో తాము ఓడిపోవడానికి ఫీల్డింగ్ సరిగా చేయకపోవడమే కారణమని CSK కెప్టెన్ రుతురాజ్ అన్నారు. ‘ఈ పిచ్‌పై 170 మంచి స్కోర్. RCB 20 రన్స్ అదనంగా చేసింది. మా ఫీల్డర్లు కీలక సమయాల్లో క్యాచులు వదిలేశారు. పెద్ద టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు కొంచెం భిన్నంగా బ్యాటింగ్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే వికెట్లు కోల్పోయాం. కేవలం 50 రన్స్ తేడాతో ఓడాం. భారీ తేడాతో ఓడనందుకు సంతోషం’ అని పేర్కొన్నారు.
News March 29, 2025
మయన్మార్‌లో మరోసారి భూకంపం

తీవ్ర భూప్రకంపనలతో ఉలిక్కిపడిన మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. అంతకుముందు మయన్మార్, థాయిలాండ్‌లో 7.7 తీవ్రతతో భూకంపం రావడంతో భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. దాదాపు 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.