News March 24, 2025

కొడంగల్: విషాదం.. యువకుడి మృతి!

image

యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్‌ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.

Similar News

News February 25, 2026

మెదక్: పరీక్షా కేంద్రాల సందర్శించిన ఎస్పీ

image

నేడు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు.

News February 25, 2026

అర్జునుడి ప్రాణాలు కాపాడిన ఘటోత్కచుడు

image

కురుక్షేత్రంలో ఘటోత్కచుడి త్యాగం అసమానం. కర్ణుడి వద్ద ఉన్న అజేయమైన ‘వాసవి శక్తి’ నుంచి అర్జునుడిని రక్షించడమే ఇందుకు కారణం. యుద్ధంలో ఘటోత్కచుడు తన శక్తులతో కౌరవ సేనను అతలాకుతలం చేస్తుంటే, గత్యంతరం లేక కర్ణుడు ఆ శక్తిని ఘటోత్కచుడిపైనే ప్రయోగించాల్సి వచ్చింది. అలా ఘటోత్కచుడు వీరమరణం పొంది, అర్జునుడి ప్రాణాలు కాపాడి పాండవుల విజయానికి కారణమయ్యాడు. చనిపోతూ తన భారీ దేహంతో కౌరవ సైన్యాన్ని అణిచివేశాడు.

News February 25, 2026

ఆర్టీసీలో సమ్మె సైరన్.. మార్చి 13 డెడ్‌లైన్

image

TG: ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, జీతాల పెంపు, పెండింగ్ బకాయిల విడుదల సహా పలు డిమాండ్లపై కార్మికులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. JAC ఆధ్వర్యంలో నిన్న HYDలోని ఇందిరా పార్కు వద్ద వేలాది మంది కార్మికులు ధర్నా చేశారు. మార్చి 13లోపు డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె నోటీసు ఇచ్చి మార్చి 18 తర్వాత స్ట్రైక్ చేస్తామని హెచ్చరించారు.