News March 24, 2025
కొడంగల్: విషాదం.. యువకుడి మృతి!

యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 8, 2025
ఖమ్మం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇన్‌ఛార్జి హల్చల్

ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఇన్‌ఛార్జి అధికారి హడావుడి కలకలం రేపింది. సెలవులో ఉన్న రెగ్యులర్ డీఎంహెచ్‌ఓ పేరుతోనే ఆయన ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ‘నేనే డీఎంహెచ్‌ఓ’ అంటూ సిబ్బందితో చెప్పడం, ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ కమిటీలో తన అనుచరులకే చోటు కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాస్పద తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
News November 8, 2025
బిహార్ ఎన్నికల్లో మంత్రి లోకేశ్ ప్రచారం

AP: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున మంత్రి లోకేశ్ 2 రోజులపాటు ప్రచారం నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగించుకుని ఇవాళ మధ్యాహ్నం ఆయన పట్నా వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం బిహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలను వారికి వివరిస్తారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రేపు ఉదయం ప్రచారం చేస్తారు.
News November 8, 2025
ప్రభుత్వ స్కూళ్లలో UKG.. 9,800 మందికి ఉద్యోగాలు!

TG: రాబోయే విద్యాసంవత్సరం 2026-27 నుంచి మరో 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే వెయ్యి స్కూళ్లలో ప్రారంభించింది. ఒక్కో స్కూల్లో టీచర్ (ఇన్‌స్ట్రక్టర్), ఆయాను నియమిస్తారు. అంటే 9,800 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దశల వారీగా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.


