News March 24, 2025
వరంగల్: నగర అభివృద్ధికి సహకరించండి: కమిషనర్

పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరపు పన్నులు చెల్లించడానికి 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే రెడ్ నోటీసులు అందించి ఆస్తులను జప్తు చేస్తున్నామని హెచ్చరించారు.
Similar News
News November 6, 2025
ముంపు సమస్యపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

వరంగల్ నగరంలో ముంపు సమస్యను శాశ్వతంగా నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గురువారం తెలిపారు. ఆమె బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి చిన్న వడ్డేపల్లి చెరువు, లక్ష్మి గణపతి కాలనీ, ఎల్.బి. నగర్, అంబేడ్కర్ నగర్ ప్రాంతాలను సందర్శించారు. ముంపు పరిస్థితులను దగ్గర నుండి పరిశీలించి, సమస్య పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.
News November 6, 2025
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలపై వరంగల్ పోలీసుల హెచ్చరిక

డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను మోసం చేసే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. మోసగాళ్లు పోలీసుల పేరుతో ఫోన్ కాల్స్ చేసి, ముఖ్యంగా వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మీపై కేసు నమోదైంది, మిమ్మల్ని డిజిటల్‌గా అరెస్ట్ చేస్తాం అంటూ భయపెట్టి, డబ్బులు బదిలీ చేయమని ఒత్తిడి తెస్తున్నారు. మోసపూరిత కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలన్నారు.
News November 6, 2025
కళాశాలలను తనిఖీ చేసిన డీఐఈఓ శ్రీధర్ సుమన్

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు, రికార్డుల నిర్వహణలో ఇంటర్ బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని DIEO శ్రీధర్ సుమన్ సూచించారు. ఖానాపూర్ మోడల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నర్సంపేట ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ కళాశాలలను DIEO తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ అభ్యసన తరగతులు నిర్వహించాలన్నారు.


