News March 24, 2025

తిరుపతి జిల్లాలో నామినేటెడ్ పదవులు దక్కేదెవరికి.?

image

రాష్ట్రంలో త్వరలో మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా సిద్ధం అవుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో జిల్లాలో పలువురు పదవులు ఆశిస్తున్నారు. మాజీ MLA సుగుణమ్మ, మాజీ మంత్రి పరస్సా రత్నం, చంద్రగిరి నుంచి డాలర్ దివాకర్ రెడ్డి, సత్యవేడు నుంచి TDP తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ హేమలత, తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ తదితరులు ఉన్నారు. పార్టీ కోసం పని చేశామని ఈ సారైనా పదవులు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 15, 2026

మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN

image

AP: తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్, విశాఖకు బీచ్‌కు ప్రసిద్ధి అని CM చంద్రబాబు అన్నారు. ఈ మూడింటినీ మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌గా మారుతుందని నారావారిపల్లెలో మీడియాతో పేర్కొన్నారు. 2027 నాటికి రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని చెప్పారు.

News January 15, 2026

బాపట్ల: త్రిపురనేని రామస్వామికి చౌదరికి నివాళి

image

నేటి సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి, సమానత్వం వైపు అడుగులు వేయడానికి త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం స్ఫూర్తి అని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతిని పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు.

News January 15, 2026

BREAKING: టెర్రస్ వార్‌.. HYDలో చిందిన రక్తం

image

అత్తాపూర్ PS పరిధిలోని పాండురంగనగర్‌బస్తీలో పతంగులు ఎగరేస్తున్న సమయంలో రెండు అపార్ట్‌మెంట్‌ల వాసుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఖాళీ సీసాలను పక్క బిల్డింగ్‌పైకి విసిరారు. కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా గొడవ జరిగింది. కొందరు యువకులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు గాయాలు అయ్యాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.