News March 24, 2025
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి: రజినీకాంత్

సముద్ర తీర ప్రాంతాలలో నివసించే ప్రజలు కొత్త వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూపర్ స్టార్ రజినీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులు ఈ మార్గం గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశముందన్నారు. దీనిపై అవగాహాన కల్పించేందుకు 100 మంది CISF జవాన్లు సైకిల్ యాత్ర చేపడుతున్నారని, వారికి సహాకరించాలని కోరారు. 26/11 దాడిలో ఉగ్రవాదులు సముద్రం గుండా వచ్చి దాడి చేసిన ఘటనను గుర్తు చేశారు.
Similar News
News March 29, 2025
OFFICIAL: 1000 మంది మరణం

మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం వేలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటివరకూ 1000 మందికి పైగా ప్రజలు చనిపోయినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. 2000 మంది గాయపడ్డట్లు పేర్కొన్నాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. చాలామంది సాయం కోసం ఎదురుచూస్తుండటంతో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలోనే భారత్ తనవంతు సాయంగా 15 టన్నుల ఆహారపదార్థాలను మయన్మార్‌కు పంపింది.
News March 29, 2025
రెడ్‌బుక్ పేరెత్తితే కొందరికి గుండెపోటు వస్తోంది: లోకేశ్

AP: తాను ఎక్కడికి వెళ్లినా రెడ్‌బుక్ గురించి ప్రస్తావన వస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘రెడ్‌బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని పేరు చెప్పగానే కొందరికి గుండెపోటు వస్తోంది. కొందరు బాత్రూమ్‌లో కాలుజారి పడి చెయ్యి విరగ్గొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఇగోలు వద్దు. కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి పని చేద్దాం’ అని లోకేశ్ అన్నారు.
News March 29, 2025
పాస్టర్ ప్రవీణ్ మృతి దర్యాప్తు.. పోలీసుల హెచ్చరిక

పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి విచారణ పారదర్శకంగా జరుగుతోందని తూర్పు గోదావరి ఎస్పీ నరసింహ కిశోర్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఐదు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. సీసీ ఫుటేజీల పరిశీలన, సమాచార సేకరణ జరుపుతున్నాయి. సీఎం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.