News March 24, 2025
నారాయణపేటలో రాజేందర్ రెడ్డి VS పర్ణికారెడ్డి

నారాయణపేటలో MLAపర్ణికారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఇటీవల జరిగిన CMసభలో వివిధ మండలాల సమస్యలపై విన్నవించారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటూ ముందుకు సాగుతున్నారు. BRS జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజేందర్ రెడ్డి అధిష్ఠానం పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అయితే మరింత జోష్ పెంచాలని శ్రేణులు కోరుతున్నాయి.
Similar News
News November 3, 2025
‘పుల్లోరం’ కోడి పిల్లలకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
News November 3, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

AP: బాపట్లలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మరణించిన వారు బాపట్ల MLA నరేంద్ర వర్మ బంధువులని సమాచారం. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్లపాలెం గ్రామానికి చెందిన పుష్పవతి(60), శ్రీనివాసరాజు(54), బలరామరాజు(65), లక్ష్మి(60)గా గుర్తించారు.
News November 3, 2025
కామారెడ్డిలో WWC విజయ సంబరాలు

మహిళ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సందర్భంగా ఆదివారం రాత్రి కామారెడ్డిలో క్రికెట్ అభిమానులు బాణసంచా కాల్చి జాతీయ జెండాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళ క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పండుగ వాతావరణం నెలకొంది.


