News March 24, 2025
ఎటపాకకు చెందిన వ్యక్తి గోదావరిలో దూకి ఆత్మహత్య

ఎటపాకకు చెందిన అనిల్ అనే వ్యక్తి భద్రాచలం బ్రిడ్జి మీద నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 10 ఏళ్ల క్రితం అనిల్ భార్య రజిని ఆత్మహత్య చేసుకుందని, అప్పటి నుంచి అనిల్ మనోవేదనకు గురైన మద్యానికి బానిసయ్యాడన్నారు. ఈనెల 16న నుంచి మద్యం తాగడం మానేశాడని.. 20వ తేదీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
Similar News
News March 29, 2025
నంద్యాల: ఉగాది సందర్భంగా ప్రత్యేక రైళ్లు

ఉగాది సందర్భంగా నంద్యాల మీదుగా రెండు రైళ్ల ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు-హుబ్లీ మధ్య ఈ రైళ్లను ఏర్పాటు చేశారు. ఈనెల 31న రాత్రి 8 గంటలకు గుంటూరు నుంచి హుబ్లీకి బయలుదేరే రైలు(07271) నంద్యాలకు రాత్రి 12:50 గంటలకు చేరనుంది. అలాగే వచ్చే నెల 1న ఉదయం 11 గంటలకు హుబ్లీ నుంచి గుంటూరుకు బయలుదేరే రైలు(07272) నంద్యాలకు రాత్రి 7:50 గంటలకు చేరనుంది.
News March 29, 2025
మెట్పల్లి మార్కెట్లో పసుపు ధరలు..

మెట్పల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 12,566, కనిష్ఠ ధర రూ. 9,211, పసుపు గోళ గరిష్ఠ ధర రూ. 11,888, కనిష్ఠ ధర రూ. 9,051, పసుపు చూర గరిష్ఠ ధర రూ. 9,452, కనిష్ఠ ధర రూ. 8,183లుగా పలికాయి. కాగా ఈ సీజన్లో మొత్తం కొనుగోళ్ళు 36,557 క్వింటాళ్లు కాగా, ఈ రోజు 325 క్వింటాళ్ల కొనుగోళ్ళు జరిగాయి.
News March 29, 2025
MDCL: గిరిజన తండాలు.. గొప్పగా మారేనా..?

MDCL మల్కాజిగిరి పరిధిలోని 61 గ్రామపంచాయతీల పరిసర ప్రాంతాల్లో అనేక గిరిజన తండాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మున్సిపాలిటీల కిందికి వెళ్లనున్న నేపథ్యంలో గిరిజన తండాలు గొప్ప అభివృద్ధి ప్రాంతాలుగా మారుతాయా..? అని అక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం మా వెనుకబడ్డ గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.