News March 25, 2024
గంటాకే భీమిలి.. త్వరలో ప్రకటన?

భీమిలి టికెట్ చివరికి గంటా శ్రీనివాసరావుకే దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆయనతో పాటు మరో ఇద్దరికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయించినట్లు తెలుస్తోంది. వీరిలో గంటాకే ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు ఫీడ్‌బ్యాక్ వచ్చిందని టీడీపీ వర్గాలంటున్నాయి. దీంతో ఆఖరి నిమిషంలో మార్పు ఉంటే తప్ప.. నేడో రేపో భీమిలి టికెట్‌ను గంటాకు ప్రకటించడం లాంఛనమేనని అంతర్గత వర్గాల సమాచారం.
Similar News
News April 19, 2025
10 రోజుల్లో రూ.4,200 పెరిగిన గోల్డ్ రేటు

శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గత పది రోజుల్లోనే తులం బంగారంపై రూ.4,200లు పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. అయితే, మూడు రోజులకే టారిఫ్స్ హోల్డ్ చేయడంతో రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఈనెల 10న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,380 ఉండగా ఇవాళ అది రూ.97,580కి చేరింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.89,450గా ఉంది.
News April 19, 2025
పెళ్లిపై నాకు నమ్మకం లేదు: త్రిష

వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని హీరోయిన్ త్రిష అన్నారు. పెళ్లి అయినా, కాకపోయినా తనకు ఫరవాలేదని ఆమె తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. కాగా త్రిష ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’లోనూ ఆమె కనిపించనున్నారు.
News April 19, 2025
మామిడి పండ్లు తింటున్నారా?

వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తుచ్చేది మామిడి పండ్లే. అయితే, కార్బైడ్‌తో మాగించిన పండ్లను తింటే అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15-20 నిమిషాలు ఉంచిన తర్వాత మంచినీటితో కడిగి, ఆపై తుడిచి తినాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తొక్కను తినకపోవడమే బెటర్ అని చెబుతున్నారు. కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిదంటున్నారు.