News March 24, 2025

ఏలూరులో యువతిపై ముగ్గురు అత్యాచారం

image

ఏలూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. జేపీ నగర్‌కు చెందిన వంశీకృష్ణ యువతి(18)ని ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ వంశీకృష్ణ స్నేహితులు సాయిచరణ్, శివశంకర్ సైతం ఆమెను అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మొత్తం ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News November 8, 2025

పెద్దపల్లి: గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన దండు రాజు(47) గడ్డి మందు తాగి మరణించాడు. హమాలీ పనులు చేస్తూ మద్యానికి బానిసైన రాజు నిన్న మధ్యాహ్నం మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ కిషన్ తెలిపారు.

News November 8, 2025

AP న్యూస్ రౌండప్

image

☛ కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్.. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని హామీ
☛ తిరువూరు వివాదం.. CBNకు TDP క్రమశిక్షణ కమిటీ నివేదిక
☛ వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి
☛ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో సీదిరి అప్పలరాజుకు నోటీసులు.. కాశీబుగ్గ PSలో 3గంటలుగా ప్రశ్నిస్తున్న పోలీసులు

News November 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 60 సమాధానాలు

image

1. కృష్ణుడి మొదటి గురువు ‘సాందీపని’.
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ‘బృందావనం’ అని అంటారు.
3. నాగులకు తల్లి ‘కద్రువ’.
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ‘బ్రహ్మ’.
5. స్కందుడు అంటే ‘కుమారస్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>