News March 24, 2025
KU: నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు

HNK కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 10, 2026
అనంతపురం: గుండెపోటుతో SI మృతి

అనంతపురం జిల్లా పోలీస్ కంట్రోల్ రూం SI మోహన్ ప్రసాద్ విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కన్నుమూశారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఎస్సై మృతి పట్ల జిల్లా ఎస్పీ జగదీశ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు. జేఎన్టీయూ రోడ్డులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, సహచర సిబ్బంది నివాళులర్పించారు.
News January 10, 2026
సంగారెడ్డి: సెలవులో తరగతులు నిర్వహించవద్దు: డీఈవో

సంక్రాంతి సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News January 10, 2026
GNT: నటబ్రహ్మ ముక్కామల.. రంగస్థలం నుంచి వెండితెర దాకా

నటుడు, దర్శకుడు ముక్కామల కృష్ణమూర్తి (1920-1987) ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. న్యాయవాదిగా ఉంటూనే రంగస్థలంపై ‘బొబ్బిలి యుద్ధం’ నాటకంలో బుస్సీ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మాయా మచ్ఛీంద్ర’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చి, మాయాబజార్ (దుర్యోధనుడు), నర్తనశాల, తెనాలి రామకృష్ణ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘మరదలు పెళ్లి’, ‘రుష్యశృంగ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.


