News March 24, 2025
ఘోర ప్రమాదం.. తమిళనాడులో కడప యువకులు మృతి

దైవదర్శనానికి వెళ్తున్న కడప యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కడపకు చెందిన నాగేంద్ర(31), శేషాచలం(29) ఆదివారం తమిళనాడు తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి దర్శనానికి బైకుపై వెళ్లారు. రాణీపేట సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కంటైనర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కిందపడ్డారు. అదే సమయంలో వచ్చిన కారు వారిపై వెళ్లింది. దీంతో ఇద్దరి శరీరాలు చిధ్రమై స్పాట్‌లో మృతి చెందారు.
Similar News
News March 29, 2025
బేగంపేట AIRPORT కింద సొరంగం.. గ్రీన్ సిగ్నల్ !

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవు HMDA ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ తీసుకెళ్తున్నట్లు HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు స్ట్రీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విమానాశ్రయం కింద సొరంగం నిర్మించేందుకు AAI తాజాగా అనుమతి లభించగా.. HMDA టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
News March 29, 2025
రాష్ట్రంలో 4,818 చలివేంద్రాలు

TG: ఎండలు ముదిరిన నేపథ్యంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 4,818 చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 458, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరిలో 8 చలివేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. వాటర్ బాటిల్స్ కొనుక్కోకుండా, చలివేంద్రాల్లో ఉచితంగా నీటిని తాగాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 29, 2025
గురుకులాల్లో ప్రవేశాలు.. దరఖాస్తు గడువు పెంపు

AP: గురుకుల స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగిలిన ఖాళీల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 6లోగా https://aprs.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్షకు కూడా ఏప్రిల్ 6 వరకు అప్లై చేసుకోవచ్చని సూచించారు.