News March 24, 2025
జాగ్రత్తగా మాట్లాడితే మంచిది: రజినీకి MP లావు కౌంటర్

AP: MP లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆదేశాలతోనే తనపై ACB కేసు పెట్టిందని విడదల రజినీ ఆరోపించడంపై MP స్పందించారు. ‘ఫోన్ డేటా, భూముల విషయాలపై జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఒకరిని విమర్శించే ముందు వివరాలన్నీ తెలుసుకోవాలి. లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్‌కు, నాకూ ఏ సంబంధం లేదని IPS అధికారి పి.జాషువా స్టేట్‌మెంట్‌లో చెప్పారు. స్టోన్ క్రషర్స్‌లో అక్రమాలు జరిగాయని మీరే ఫిర్యాదు చేశారు’ అని అన్నారు.
Similar News
News March 29, 2025
694 మంది మృతి

నిన్న సంభవించిన భూకంపం వల్ల ఇప్పటివరకు 694 మంది మరణించారని మయన్మార్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరో 68 మంది మిస్సింగ్ అయినట్లు తెలిపాయి. ఈ విషాద ఘటనలో 1670 మంది గాయపడ్డారని వెల్లడించాయి. అటు అనధికార లెక్కల ప్రకారం మరణాల సంఖ్య 1000 ఉండొచ్చని US జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. భూకంపంతో భవనాలు కుప్పకూలగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి.
News March 29, 2025
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు

TG: ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 36-41 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
News March 29, 2025
17 ఏళ్లుగా మహిళ కడుపులోనే కత్తెర!

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ దాదాపు 17 ఏళ్లు కడుపు నొప్పి భరించాల్సి వచ్చింది. యూపీలోని లక్నోకు చెందిన సంధ్యా పాండే అనే మహిళ పురిటి నొప్పులతో ఫిబ్రవరి 28, 2008న ‘షీ మెడికల్ కేర్’ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు సి-సెక్షన్ ఆపరేషన్ చేయగా.. ఆ సమయంలో కత్తెరను ఆమె కడుపులోనే మర్చిపోయారు. ఇన్నేళ్లుగా కడుపు నొప్పి వస్తుండటంతో KGMU ఆస్పత్రికి తీసుకెళ్లి స్కాన్ చేయించడంతో అసలు విషయం బయటపడింది.