News March 24, 2025

తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

image

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News March 29, 2025

ఏప్రిల్ 1 వరకు నాగర్‌కర్నూల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

image

నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం విడుదల చేసిన రిపోర్ట్‌లో ఏప్రిల్ ఒకటి వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగనుంది. 40 డిగ్రీల వరకు జిల్లాలో ఉష్ణోగ్రతల నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.

News March 29, 2025

ధోనీకి చెప్పే ధైర్యం కోచ్‌లకు లేదు: మనోజ్

image

CSK జట్టును గెలిపించేందుకు ధోనీని ముందే బ్యాటింగ్‌కు వెళ్లమని చెప్పే ధైర్యం కోచింగ్ సిబ్బందికి లేదని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ విమర్శించారు. 9వ స్థానంలో ధోనీ రావడం ఏంటని ప్రశ్నించారు. ‘ధోనీ 16 బంతుల్లో 30 రన్స్ చేసి అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నారు. ఇలాంటి బ్యాటర్ ముందే బ్యాటింగ్‌కు రావాల్సింది. ఈ విషయాన్ని కోచ్‌లు కూడా చెప్పలేరు. ఎందుకంటే ధోనీ ఒకసారి నిర్ణయించుకుంటే అంతే’ అని తెలిపారు.

News March 29, 2025

అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

అంబర్ పేట పీఎస్‌లో న్యూస్‌లైన్ నిర్వాహకుడు, యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఓ మహిళ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69,79,352, 351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు అంబర్ పేట పోలీసులు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపణ చేసింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపారు.

error: Content is protected !!