News March 24, 2025
తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News September 16, 2025
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు పిరికివాళ్లుగా మారారు: KTR

TG: పార్టీ మారిన MLAలు ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని KTR అన్నారు. వాళ్లు ఎందుకు పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలన్నారు. ‘రేవంత్ చేతిలో మోసపోవడంలో ప్రజల తప్పు లేదు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో మేం విఫలమయ్యాం. చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. ఆ రోజే కాంగ్రెస్ దొంగ పార్టీ అని వివరిస్తే బాగుండేది. INCకి దమ్ముంటే ఉపఎన్నికకు వెళ్లాలి’ అని పేర్కొన్నారు.
News September 16, 2025
జిల్లాలో ప్రతి రైతుకు యూరియా అందిస్తాం: కలెక్టర్

జిల్లాలో పంటలు పెట్టిన ప్రతి రైతుకు యూరియా పంపిణీ చేస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సిబ్బంది జిల్లాలో యూరియా పంపిణీ, రైతు సేవా కేంద్రాల వివరాలు ముందుగానే రైతులకు తెలియజేయాలన్నారు. మంగళవారం జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో RSKలు, PACS 27 కేంద్రాల ద్వారా 465.700 మెట్రిక్ టన్నుల యూరియాను 4,236 మంది రైతులకు పంపిణీ చేశారని చెప్పారు.
News September 16, 2025
క్రీడా, సాంస్కృతిక విభాగాల్లో శిక్షణ అందించాలి: కలెక్టర్

విద్యార్థినులకు క్రీడా, సాంస్కృతిక విభాగాల్లో శిక్షణ అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మరిపెడ మండలం గిరిపురంలో ఉన్న కేజీబీవీ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని డైనింగ్ హాల్, స్టోర్ గది, కిచెన్ షెడ్, పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం సూచించిన విధంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, వైద్య పరీక్షలు, డిజిటల్ తరగతులు ప్రతి సబ్జెక్టుపై అవగాహన కల్పించాలన్నారు.