News March 24, 2025
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్.. ఆరుగురు అరెస్ట్!

TG: ఈనెల 21న నల్గొండ జిల్లా నకిరేకల్ గురుకులంలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ కావడం కలకలం రేపింది. ఎగ్జామ్ మొదలైన కాసేపటికే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు తాజాగా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్‌మెంటల్ అధికారి రామ్మోహన్‌ను విధుల నుంచి తొలగించారు. ఇదే కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News March 26, 2025
రామ్ చరణ్ కొత్త సినిమా అప్డేట్

రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న RC16 నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపు చెర్రీ జన్మదినం పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఉ.9.09 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
News March 26, 2025
ఎంపీ మిథున్‌రెడ్డిపై తొందరపాటు చర్యలొద్దు: హైకోర్టు

AP: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మద్యం కేసులో ఏప్రిల్ 3 వరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీ పోలీసులను ఆదేశించింది. అయితే ఎంపీకి ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు.
News March 26, 2025
‘ఆన్‌లైన్ బెట్టింగ్’పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు: కేంద్రమంత్రి

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ అంశాలు రాష్ట్ర పరిధిలోనివని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. వీటిపై ఆయా రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ వ్యవహారంలో కేంద్రం తన నైతిక బాధ్యత నుంచి తప్పుకుంటోందా? అని డీఎంకే ఎంపీ దయానిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇది రాష్ట్రాల పరిధిలోనిది అయినా ఫిర్యాదుల ఆధారంగా 1,410 గేమింగ్ సైట్లను నిషేధించామని చెప్పారు.