News March 24, 2025

5 స్టార్ ఏసీ వాడితే.. 60 శాతం కరెంట్ ఆదా

image

5 స్టార్ రేటెడ్ ACలు వాడితే 60% వరకు విద్యుత్ ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(BEE) సౌత్ఇండియా మీడియా అడ్వైజర్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో వాడుతున్న ACల్లో అత్యధికం 8ఏళ్ల కంటే పాతవని, ఇవి 40-50% విద్యుత్ అధికంగా వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెప్పాయన్నారు. ACని 24°C వద్ద వాడటం ఉత్తమమన్నారు. 5స్టార్ రేటెడ్ ACలతో భూతాపాన్ని తగ్గించడంతో పాటు గ్రీన్ హౌజ్ గ్యాసెస్‌ని అరికట్టవచ్చని తెలిపారు.

Similar News

News March 27, 2025

ఏప్రిల్ 3న వేములవాడకు రానున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

image

ఏప్రిల్ 3వ తేదీన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట ప్రవీణ్ వచ్చే నెల 3వ తేదీన జిల్లాలోని వేములవాడకు సాయంత్రం చేరుకుంటారు. 4వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

News March 27, 2025

డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం.. పవన్ సానుభూతి

image

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి ఇవాళ హైదరాబాద్‌లో కన్నుమూశారు. సత్యవతి మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

News March 27, 2025

ప్రభుత్వ ఆఫీసుల్లో AI వినియోగంపై నిషేధం లేదు: కేంద్రమంత్రి

image

ప్రభుత్వ కార్యాలయాల్లో AI వినియోగంపై ప్రత్యేకంగా ఎలాంటి నిషేధం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతను వాడుతున్న సమయంలో ప్రజా సమాచార భద్రత, గోప్యత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాజ్యసభలో చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా అప్లికేషన్, వెబ్‌సైట్, సాంకేతికతను ఉపయోగించిన విషయంలో సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌కు లోబడి వ్యవహరించాలని కేంద్రం పేర్కొంది.

error: Content is protected !!