News March 25, 2024

దేవరకొండ: రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కొండమల్లేపల్లి మండలం బాపూజీ నగర్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ రామ్మూర్తి వివరాల ప్రకారం.. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంటిలో రమావత్ బాలు నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారుడు ప్రేమ్(2) ఇంటి ఆవరణలో రోడ్డుకు సమీపంలో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా క్రేన్ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News January 19, 2026

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ చంద్రశేఖర్

image

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం జరిగిన ‘ప్రజావాణి’లో ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. మండల ప్రత్యేక అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. నూతన సర్పంచ్‌లు శిక్షణను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News January 19, 2026

ఇందిరమ్మ ఇళ్లపై నల్గొండ కలెక్టర్‌కు ఫిర్యాదు

image

మొల్కపట్నంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో భారీగా అవకతవకలు జరిగాయని గ్రామస్థులు సోమవారం కలెక్టర్ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. మొదట అధికారులు సర్వే చేసి తాము అర్హులమని చెప్పారని, తీరా ఇళ్లు నిర్మించుకునే సమయానికి అనర్హులంటూ జాబితా నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు కేటాయించారని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు విన్నవించారు.

News January 19, 2026

నల్గొండ: ఖతార్‌లో భారీగా ఉద్యోగాలు

image

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు TOMCOM మంచి అవకాశం కల్పిస్తోంది. ఖతార్‌లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, సివిల్ ఇంజినీర్, HSE ఆఫీసర్ వంటి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్.పద్మ తెలిపారు. 25-35 ఏళ్ల వయస్సు ఉండి, సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతంతో పాటు ఇతర వసతులు ఉంటాయని చెప్పారు.