News March 24, 2025

MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్‌తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Similar News

News March 26, 2025

ఎచ్చెర్ల: బడివానిపేట వీఆర్వో ఆకస్మిక మృతి

image

ఎచ్చెర్ల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బడివానిపేట వీఆర్వో రాజారావు కార్యాలయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం ఉదయం కార్యాలయానికి ఆయన వచ్చారు. సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. తక్షణం సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 26, 2025

భద్రాచలం: ప్రమాదంలో.. ఇద్దరు మేస్త్రీలు, నలుగురు కూలీలు మృతి?

image

భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలగా, ఆరుగురు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భద్రాచలానికి చెందిన తాపీ మేస్త్రీలు ఉపేంద్ర, కామేష్‌లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మిగతా వారు అడ్డా కూలీలు కాగా, వారి వివరాలు తెలియాల్సి ఉంది. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

News March 26, 2025

కృష్ణా: జిల్లాలో మోటార్లు దొంగతనం చేస్తున్న వ్యక్తులు అరెస్ట్

image

కృష్ణాజిల్లాలోని వివిధ మండలాలలో మోటార్ల వద్ద విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను కంకిపాడు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దుండగుల నుంచి 216 మోటార్లు, 7 ట్రాన్స్‌ఫార్మర్‌లకు సంబంధించి సుమారు రూ.4.50 లక్షల విలువైన, 2400 మీటర్ల పొడవు, 300 కేజీల బరువున్న రాగి వైర్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు.

error: Content is protected !!