News March 24, 2025

ఖమ్మం: జోష్ పెంచిన బీఆర్ఎస్  

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 9స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. BRSలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సైతం కాంగ్రెస్‌లో చేరడంతో BRS ఖాళీ అయ్యింది. దీంతో ఎన్నికల తరువాత BRSనేతలు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే పార్టీ అధినేత ఆదేశాల మేరకు కాంగ్రెస్ వైఫల్యాలను గట్టిగానే ప్రజల్లోకి తీసుకెళుతుంది. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రెస్‌మీట్‌లు పెట్టి అధికార పార్టీకి కౌంటర్‌లు ఇస్తోంది.

Similar News

News July 7, 2025

నెల్లూరు: ప్రార్థనల అనంతరం మీ దారెటు.?

image

నెల్లూరులో బారాషాహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ప్రారంభమైన విషయం తెలిసింది. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు నెల్లూరుకు చేరుకున్నారు. ప్రతి ఏడాది ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులు జిల్లాలోని పలు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్తారు. వాటిలో ముఖ్యమైనవి:
☞ ఏఎస్ పేట దర్గా ☞ కసుమూరు దర్గా ☞ సోమశిల ప్రాజెక్టు
☞ మైపాడు బీచ్ ☞ పెంచలకోన ☞ కండలేరు రిజర్వాయర్ ☞ ఉదయగిరి కోట
మీరు ఎక్కడికి వెళ్తున్నారు.?

News July 7, 2025

ANMల బదిలీలలో చిక్కుముడులు.. మరోసారి కౌన్సెలింగ్

image

గుంటూరు జిల్లా వైద్య శాఖ ఇటీవల ANM గ్రేడ్-3గా ఉన్న సుమారు 200 మందికి పదోన్నతులు మంజూరు చేసి కొత్త నియామకాలు ఇచ్చింది. కానీ గత కౌన్సెలింగ్‌లో అదే పోస్టులు ఖాళీలుగా చూపటంతో పలువురు ఎంపిక చేసుకున్నారు. ఈ అంశం అధికారులు గుర్తించడంతో గత కౌన్సెలింగ్‌ను రద్దు చేసి సోమవారం మళ్లీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మీ తెలిపారు. ఈసారి ప్రక్రియ సునిశ్చితంగా, సీనియారిటీ ప్రాతిపదికన సాగనుంది.

News July 7, 2025

ఉమ్మడి పాలమూరు గిరిజనులకు GOOD NEWS

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రంలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన నియోజకవర్గాలకు మొత్తం 8,750 ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా 1,319 ఇండ్లు శాంక్షన్ చేసినట్లు తెలిపింది. ఈ లబ్ధిదారులకు ఈరోజు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అచ్చంపేటలోని మున్ననూర్‌లో మంజూరు పత్రాలను ఇవ్వనున్నారు.