News March 24, 2025
SLBC ఘటనపై నేడు సీఎం రేవంత్ సమీక్ష

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పరిధి నాగర్ కర్నూల్ జిల్లా SLBC సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శాసనసభ కమిటీ హాల్లో సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 12 ఏజెన్సీల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఈ సమావేశానికి పిలించింది. కాగా గల్లంతైన 8 మంది కార్మికుల్లో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు.
Similar News
News March 26, 2025
ఎచ్చెర్ల: బడివానిపేట వీఆర్వో ఆకస్మిక మృతి

ఎచ్చెర్ల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బడివానిపేట వీఆర్వో రాజారావు కార్యాలయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం ఉదయం కార్యాలయానికి ఆయన వచ్చారు. సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. తక్షణం సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News March 26, 2025
భద్రాచలం: ప్రమాదంలో.. ఇద్దరు మేస్త్రీలు, నలుగురు కూలీలు మృతి?

భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలగా, ఆరుగురు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భద్రాచలానికి చెందిన తాపీ మేస్త్రీలు ఉపేంద్ర, కామేష్‌లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మిగతా వారు అడ్డా కూలీలు కాగా, వారి వివరాలు తెలియాల్సి ఉంది. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
News March 26, 2025
కృష్ణా: జిల్లాలో మోటార్లు దొంగతనం చేస్తున్న వ్యక్తులు అరెస్ట్

కృష్ణాజిల్లాలోని వివిధ మండలాలలో మోటార్ల వద్ద విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను కంకిపాడు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దుండగుల నుంచి 216 మోటార్లు, 7 ట్రాన్స్‌ఫార్మర్‌లకు సంబంధించి సుమారు రూ.4.50 లక్షల విలువైన, 2400 మీటర్ల పొడవు, 300 కేజీల బరువున్న రాగి వైర్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు.