News March 25, 2024

లవ్ మ్యారేజ్.. మరో ఎఫైర్ పెట్టుకొని భార్యకు వేధింపులు

image

భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తపై ఉండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉండికి చెందిన సూరిబాబు, జ్యోతి 2011లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా చెడు వ్యసనాలకు బానిసైన సూరిబాబు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తనను వేధిస్తున్నాడని భార్య ఆదివారం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 16, 2026

నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్‌‌పై కేసు

image

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్‌లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.

News February 16, 2026

ప్రశాంతంగా శివరాత్రి ఉత్సవాలు: కలెక్టర్

image

జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ శివరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 క్షేత్రాలలో సోమేశ్వర స్వామి దేవాలయం, క్షీర రామలింగేశ్వర స్వామి 2 పంచారామ క్షేత్రాలు మన జిల్లాలోనే ఉండడం ఎంతో విశేషం అన్నారు. శైవక్షేత్రాలను సుమారు 3 లక్షల 50 వేల మంది పైగా భక్తులు దర్శించుకోవడం జరిగిందన్నారు.

News February 16, 2026

నేడు యథావిధిగా PGRS

image

భీమవరం కలెక్టరేట్‌, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు.