News March 24, 2025
అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

TG: అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కాసేపటికి వీరి వద్దకు కేటీఆర్ వచ్చి వివేక్‌తో కాసేపు మాట్లాడారు. వీరిని ఓ ఎమ్మెల్యే ఫొటో తీస్తుండగా కేటీఆర్ వారించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ నియోజకవర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
Similar News
News November 10, 2025
నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG: నేటి నుంచి ఈ నెల 26 వరకు HYDలోని సురవరం ప్రతాప్ రెడ్డి(పొట్టి శ్రీరాములు) యూనివర్సిటీలో గ్రూప్-3 మెరిట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. రోజూ 10:30am నుంచి 5.30pm వరకు కొనసాగనుంది. మొత్తం 1,365 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మెరిట్ జాబితా విడుదలైంది. TGPSC <
News November 10, 2025
గజగజ వణికిస్తున్న చలి.. జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. రాత్రి నుంచి ఉదయం వరకు గజగజ వణికిస్తోంది. APలోని ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. నిన్న అల్లూరి(D) జి.మాడుగులలో అత్యల్పంగా 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు TGలో HYD శివారు పటాన్చెరులో కనిష్ఠంగా 13.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరుగుతుందని, చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 10, 2025
స్లీపింగ్ మాస్క్‌లు వాడుతున్నారా?

స్కిన్‌కేర్‌లో భాగంగా చాలామంది స్లీపింగ్ మాస్క్‌లు వాడటం ఎక్కువైంది. అయితే వీటిని ఎక్కువగా వాడటం నష్టమే అంటున్నారు నిపుణులు. ఈ మాస్కులు లైట్ క్రీమ్, జెల్‌తో ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. కానీ వీటిని రోజూ వాడటం వల్ల చర్మం ఎక్కువ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుందంటున్నారు నిపుణులు. సహజ తేమను కోల్పోయి, మొటిమలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. వారానికి 2సార్లు వాడటం మంచిదని సూచిస్తున్నారు.


