News March 24, 2025
లింగాల మండలంలో వైఎస్ జగన్

లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. తీవ్ర ఈదురుగాలులతో నేలకూలిన అరటి పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులకు భరోసా కల్పిస్తున్నారు. జగన్ వెంట కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఉన్నారు. మండలంలో దాదాపు 2500 ఎకరాలలో అరటి తోట నేలవాలినట్లు అంచనా వేశారు.
Similar News
News March 29, 2025
కొండాపురం ప్రమాదంలో గాయపడ్డ భార్య, భర్తలు మృతి

కడప జిల్లా కొండాపురం 4 వరుసల రహదారిలోని CMR కాంప్లెక్స్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైకును కారు ఢీకొనడంతో బైకులో ఉన్న సరోజ, రామమోహన్ అనే దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సరోజను చికిత్స కోసం అనంతపురం హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.<<15922594>> భర్త రామ్మోహన్<<>> అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News March 29, 2025
30 తరాలైన YCP గెలవదు: ఆదినారాయణ రెడ్డి

జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాశినాయన ఆశ్రమానికి 23 హెక్టార్ల స్థలం కావాలని 2023లో నేను లేఖ రాస్తే YCP ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో మరోసారి కేంద్ర అటవీ శాఖ మంత్రికి మేము రిక్వెస్ట్ చేస్తే 13ఎకరాలు ఇస్తామని ఆయన చెప్పారు. డైనోసార్‌లాగా వైసీపీ కాలగర్భంలో కలిసిపోయింది. 30ఏళ్లు కాదు కదా.. 30 తరాలైన వైసీపీ గెలవదు’ అని ఢిల్లీలో ఎమ్మెల్యే అన్నారు.
News March 29, 2025
కడప జిల్లాలో ప్రాణం తీసిన బెట్టింగ్

బెట్టింగ్ భూతానికి కడప జిల్లాలో ఓ యువకుడు బలయ్యాడు. ప్రొద్దుటూరులో పట్టణంలోని రామేశ్వరానికి చెందిన యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. ఏకంగా రూ.8 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. 1-టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
NOTE: ఐపీఎల్, ఆన్‌లైన్, ఇతర ఏ బెట్టింగ్ జోలికి వెళ్లకండి