News March 24, 2025
WGL మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి.. ధరలు ఇలా!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు మిర్చి పోటెత్తింది. అయితే తాము ఆశించిన విధంగా ధరలు రాలేదని అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.13,000 ధర రాగా.. 341 రకం మిర్చికి రూ.12,400 పలికిందని వ్యాపారులు తెలిపారు. అలాగే వండర్ హాట్(WH) మిర్చి క్వింటాకి రూ.14,500 ధర వచ్చిందన్నారు.
Similar News
News September 19, 2025
సిరిసిల్ల కలెక్టర్‌కు ప్రభుత్వం నోటీసులు..!

ప్రజాపాలన దినోత్సవం వేళ జెండావిష్కరణ సమయానికి రాకుండా SRCL కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రొటోకాల్ పాటించలేదని <<17746715>>MLA ఆది ఆయనపై<<>> సీరియసైన విషయం తెలిసిందే. కాగా, దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) K.రామకృష్ణారావు కలెక్టర్‌కు సంజాయిషీ నోటీసులు పంపారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలలోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.
News September 19, 2025
మైథాలజీ క్విజ్ – 10

1. శ్రీరాముడి పాదధూళితో శాపవిముక్తురాలైంది ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని ఎవరు చంపారు?
3. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు?
4. మధుర మీనాక్షి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. చిరంజీవులు ఎంత మంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#mythologyquiz<<>>
News September 19, 2025
అన్నమయ్య: టాప్ గ్రేడ్ బొప్పాయి ధర@ రూ.8

అన్నమయ్య జిల్లాలో బొప్పాయి ఎగుమతికి ధరలను నిర్ణయించినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం తెలిపారు. టాప్ గ్రేడ్ బొప్పాయి ధర కిలో రూ.8గా, సెకండ్ గ్రేడ్ ధర కిలో రూ.7గా నిర్ణయించామన్నారు. తక్కువ ధరకు బొప్పాయిని కొనుగోలు చేసే ట్రేడర్లపై రైతులు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 9573990331, 9030315951ను అందుబాటులో ఉంచారు.