News March 24, 2025

మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28న నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. 25న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా ఇటీవల రాష్ట్రంలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Similar News

News September 15, 2025

నవంబర్‌లో టెట్: కోన శశిధర్

image

AP: మెగా DSCలో ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి 29 వరకు కేటాయించిన జిల్లాలో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆ తేదీల్లోనే కౌన్సెలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగులు ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ కాని 406 పోస్టులను వచ్చే డీఎస్సీలో కలుపుతామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది DSC నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నవంబర్‌లో టెట్ ఉంటుందని, ప్రిపేర్ కావాలని సూచించారు.

News September 15, 2025

భారత్ విక్టరీ.. ముఖం చాటేసిన పాక్ కెప్టెన్

image

భారత్‌ చేతిలో ఘోర ఓటమో, షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదనో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడకుండా ముఖం చాటేశారు. పీసీబీ ఆదేశాలతోనే ఆయన ఈ సెర్మనీకి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం మ్యాచ్ ముగిసిన వెంటనే ఓడిన జట్టు కెప్టెన్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడతారు. మరోవైపు షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా భారత్ క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించిందని పాక్ ACAకు ఫిర్యాదు చేసింది.

News September 15, 2025

రాబోయే రెండు గంటల్లో వర్షం

image

ఏపీలోని ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. TGలోని సంగారెడ్డి, వికారాబాద్, HYD, RR, కామారెడ్డి, MDK, SDPT, SRPT, NLG, KMM, కొత్తగూడెం, భువనగిరి, HNK, SRCL, జగిత్యాల, KNR, ADLB, NZMBలో సాయంత్రం తర్వాత పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.