News March 24, 2025

పెనుమంట్ర: 5 నెలల్లో ఐదుగురు మృత్యువాత

image

పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ నుంచి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వరకు ఉన్న రహదారిపై ఐదు నెలల వ్యవధిలో ఐదుగురు వాహనదారులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతం ఇరుకుగా మారడంతో పాటు భారీ వాహనాల అతివేగం ప్రమాదాలకు కారణమని స్థానికులు అంటున్నారు. నిత్యం ఈ దారిలో ఏదొక వాహన ప్రమాదం జరగడం పరిపాటిగా మారిందంటున్నారు. రహదారి వెడల్పు చేస్తేనే కానీ ప్రమాదాలు తగ్గవని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

Similar News

News September 11, 2025

మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా దృష్టి: కలెక్టర్

image

స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో బుధవారం ఉపాధి అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గుర్రపు డెక్క నుంచి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News September 11, 2025

‘ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై తనిఖీ చేయాలి’

image

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.

News September 10, 2025

హెక్తాన్-25 విజేతలకు బహుమతుల ప్రదానం

image

ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి బుధవారం రాత్రి భీమవరంలో నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ హెక్తాన్-25 సెమీఫైనల్స్‌లో విన్నర్స్‌, రన్నర్స్‌కు కలెక్టర్ నాగరాణి బహుమతులు అందించారు. విన్నర్స్‌గా భీమవరం, రాజమండ్రి, సూరంపాలెం, కాకినాడ కళాశాలలు దక్కించుకున్నాయి. రన్నర్స్‌గా తుని, రాజమండ్రి, భీమవరం, సూరంపాలెం, గైడ్ ఇంజినీరింగ్ కాలేజీ, రాజమండ్రి కళాశాల నిలిచాయి.