News March 24, 2025

సింహాచలం అప్పన్న పెండ్లిరాట ఎప్పుడంటే?

image

సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి అనగా వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పెండ్లిరాట మహోత్సవాన్ని ఉగాది పర్వదినాన జనపనున్నారు. ఈనెల 30వ తేదీన సాయంత్రం సుముహూర్త సమయంలో పెండ్లిరాటను వేస్తారు. మండపంలో మధ్యాహ్నం నూతన పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఈ పెండ్లిరాట మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

Similar News

News January 12, 2026

విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి

image

విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. విశాఖ నూతన జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి రానున్నారు. ఆమె గతంలో చిత్తూరు జిల్లా జేసీగా పనిచేశారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

News January 12, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్‌ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.