News March 25, 2024

కూకట్‌పల్లిలో యువతిపై అత్యాచారం 

image

ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన KPHBలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్‌కు చెందిన ఓ యువతి(30) సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి సంబంధించి KPHBలో ఆన్‌లైన్‌ శిక్షణకు చేరింది. ఈక్రమంలో ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు నరేందర్ కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం శిక్షణ సహచరుడు సంతోష్‌కు తెలపగా అతడు కూడా ఆమెను వేధించాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. నరేందర్, సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News July 8, 2024

గచ్చిబౌలి: స్కిల్ డెవలప్ మెంట్ సమావేశంలో పాల్గొన్న సీఎం

image

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీలో స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. కాలేజీలో నిర్మాణమవుతున్న కన్వెన్షన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.

News July 8, 2024

HYD: ప్లాస్టిక్ సర్జరీలపై ప్రత్యేక సేవలు: డా.లక్ష్మీ

image

ప్రపంచ ప్లాస్టిక్ శస్త్రచికిత్స దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఉస్మానియా హాస్పిటల్‌లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకంగా సేవలు అందించనున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్, యూనిట్ చీఫ్ డాక్టర్.పలుకూరి లక్ష్మీ తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు రూమ్ నం.202లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి వైద్య సేవలు సర్జరీలు ఉచితంగా పొందవచ్చని వెల్లడించారు. అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేస్తామని పేర్కొన్నారు.

News July 8, 2024

HYD: శిథిలావస్థలోని భవనాలపై చర్యలేవి!

image

గ్రేటర్ HYD పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గతేడాది అధికార గణంకాల ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 620 భవనాలు శిథిలంగా మారాయి. సికింద్రాబాద్లో అత్యధికంగా 155, ఎల్బీనగర్లో 119, చార్మినార్లో 89, ఖైరతాబాద్లో 109, శేరిలిం గంపల్లిలో 62, కూకట్‌పల్లిలో 92 శిథిల భవనాలు ఉన్నాయి. ఈ భవనాల స్థితిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.