News March 24, 2025
ఆదోని సబ్ కలెక్టరేట్‌లో ప్రజా గ్రీవెన్స్

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజా సమస్యలు తెలుసుకొని వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డీఎల్పీఓ నూర్జహాన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సత్యవతి, ఇరిగేషన్ డీఈ షఫీ ఉల్లా, ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ పద్మజ పాల్గొన్నారు.
Similar News
News March 29, 2025
ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే: కర్నూలు ఎంపీ

తన లాంటి సామాన్యుడిని ఎంపీని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. శనివారం కర్నూలులో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఊపిరి ఉన్నంత వరకు తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. టీడీపీ పేదల పార్టీ అని తెలిపారు.
News March 29, 2025
భర్త చేతిలో భార్య దారుణ హత్య

ఉమ్మడి కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామం మజార తిమ్మనిపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు. పశువుల లక్ష్మీదేవి(35)ని భర్త చిన్న మధుకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో తలపై కొట్టగా బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
News March 29, 2025
నందవరం మండల నాయకుడికి వైసీపీ కీలక పదవి

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధిగా నందవరం మండలం హాలహర్వికి చెందిన గడ్డం లక్ష్మీనారాయణ రెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. దీంతో పార్టీ శ్రేణులు ఆయనను శుక్రవారం ఎమ్మిగనూరు పార్టీ కార్యాలయంలో సత్కరించారు. లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా మోసం చేసిందని మండిపడ్డారు.