News March 24, 2025
KMR: పదో తరగతి పరీక్షలు.. 23 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష జరగ్గా.. మొత్తం 12,579 విద్యార్థులకు గాను 12,556 మంది పరీక్ష రాయగా, 23 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
Similar News
News March 29, 2025
నిధులు కేటాయింపులు నిబంధనలు పాటించాలి: కలెక్టర్

తుడా పరిధిలోని అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు కేటాయింపు విషయంలో అధికారులు నిబంధనలు పాటించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శనివారం తిరుపతిలోని తుడా కార్యాలయంలో నగర కమిషనర్ మౌర్యతో కలిసి ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. తుడాకు సంబంధించి 2025 -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.611 బడ్జెట్ కు ఆమోదం తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ నిధులతో అభివృద్ధి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు
News March 29, 2025
డేటింగ్ యాప్‌లో ప్రేమ.. రూ.6.5 కోట్లు పోగొట్టుకున్నాడు

డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళను నమ్మి ఓ వ్యక్తి ₹6.5Cr పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్‌సింగ్ ఓ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో విడాకులు కావడంతో ప్రేమ కోసం యాప్‌లో ప్రయత్నించగా అనిత పరిచయమైంది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులతో డబ్బు సంపాదించొచ్చని నమ్మించింది. తొలుత ₹3.2Lకు గంటల్లోనే ₹24K లాభం చూపింది. దీంతో ₹6.5Cr ఇన్వెస్ట్ చేయగా ముంచేయడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.
News March 29, 2025
శేరి సుభాష్ రెడ్డికి కేటీఆర్, హరీశ్ రావు సన్మానం

శేరి సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, హరీశ్ రావు, మధుసూదనా చారి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా శేరి సేవలు కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు శేరి కృతజ్ఞతలు తెలిపారు. మండలి వైస్ ఛైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు కవిత, శంబీపూర్ రాజు, ఎల్. రమణ తదితరులు ఉన్నారు.