News March 24, 2025
తిరుమల వెంకన్న సేవలో శిరూరు మఠం పీఠాధిపతి

ఉడుపి శ్రీ శిరూరు మఠం 31వ పీఠాధిపతి వేదవర్ధన తీర్థ స్వామిజీ తమ శిశు బృందంతో కలిసి సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహద్వారం వద్ద ఆలయ పేస్కర్ రామకృష్ణ, అర్చకులు స్వామికి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలో స్వామీజీకి తీర్థప్రసాదాలను అందజేశారు.
Similar News
News March 29, 2025
తిరుపతిలో రూ.2 కోట్ల కోసం కుటుంబం కిడ్నాప్

తిరుపతి జీవకోనకు చెందిన రెండు కుటుంబాలను నగదు కోసం కిడ్నాప్ చేసిన సంఘటన శనివారం కలకలం రేపింది. జీవకోనకు చెందిన విజయ్, రమేశ్ కుటుంబ సభ్యులను కొందరు కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. బాధితులు చిత్తూరులో తమ కుటుంబ సభ్యులు ఉన్నారని, అక్కడికి వెళ్తే నగదు ఇస్తామని కిడ్నాపర్లు నమ్మబలికారు. ఐతేపల్లె వద్ద రాజేశ్ కారు నుంచి కిందికి దూకేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 29, 2025
యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌పై ఫిల్మ్ ఛాంబర్ సీరియస్?

యూట్యూబ్‌లో తప్పుడు థంబ్‌నెయిల్స్ పెడుతున్న ఘటనలపై ఫిల్మ్ ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టాలీవుడ్‌కు చెందిన పలు సంఘాలతో ఛాంబర్ తాజాగా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వాటి స్వార్థం కోసం సినిమా వారిని లక్ష్యంగా చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్ గురించి చర్చించినట్లు సమాచారం. అలాంటి యూట్యూబ్ ఛానల్స్‌పై వచ్చే నెల 1 నుంచి కఠిన చర్యల్ని తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News March 29, 2025
పాడేరు: ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్

తడికవాగు శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన శబరి ఎల్ఓసీ కమాండర్ మడకం మంగ, పార్టీ మెంబర్ మడివి రమేశ్‌ను అరెస్టు చేశామని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ప్రకటించారు. పోలీసులను హతమార్చేందుకు ఈ ఇద్దరు సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్ చేశామన్నారు. మారణాయుధాలతో వీరిద్దరూ పట్టుబడ్డారని చెప్పారు. తుపాకీ, తూటాలు, కత్తులు తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.