News March 24, 2025
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు: SP

ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి ఎవరైనా బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. అధిక మొత్తంలో లాభాలు వస్తాయని ఆశపడి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తే డయల్ 112కు గాని, వాట్సాప్ నెంబర్ 9440900005కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.
Similar News
News January 23, 2026
పారదర్శకమైన ఓటర్ల జాబితానే లక్ష్యం: DRO

చిత్తూరు కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో DRO మోహన్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 15,76,984 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించ వచ్చని ఆయన పేర్కొన్నారు.
News January 23, 2026
చిత్తూరు: మూడు విడతల్లో ప్రాక్టికల్స్

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మూడు విడతల్లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ డీఐఈవో తెలిపారు. మొదటి విడత ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు, రెండో విడత ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు, మూడో విడత ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
News January 23, 2026
చిత్తూరు: హెక్టారుకు రూ.56 వేల రాయితీ.!

కొబ్బరి తోట పెంపకానికి ప్రభుత్వం రాయితీ అందించనున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి రామాంజనేయులు తెలిపారు. ఎకరాకు 72 చెట్ల చొప్పున నాటాల్సి ఉంటుందన్నారు. అలా నాటితే హెక్టారుకు రూ.56 వేల చొప్పున ప్రభుత్వం రాయితీగా అందిస్తోందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు పట్టాపాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతో రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.


