News March 24, 2025
ఎన్టీఆర్: పరీక్షల టైం టేబుల్ విడుదల

మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో UG కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ థియరీ(సప్లిమెంటరీ) పరీక్షల టైం టేబుల్ సోమవారం విడుదలైంది. ఏప్రిల్ 3 నుంచి 17 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు KRU వర్గాలు తెలిపాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరాయి.
Similar News
News November 12, 2025
VZM: ‘రుణాల రికవరీ వందశాతం ఉండాలి’

రుణాల రికవరీ వందశాతం ఉండాలని DRDA పీడీ శ్రీనివాస్ పాణి ఆదేశించారు. స్థానిక DRDA కార్యాలయంలో ‘మన డబ్బులు.. మన లెక్కలు’ కార్యక్రమంపై మంగళవారం సమావేశం నిర్వహించారు. రుణాల లక్ష్యాన్ని సిబ్బంది చేరుకోవాలని కోరారు. గ్రామ స్థాయి సిబ్బందితో సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో APD సావిత్రి, DPMలు చిరంజీవి, లక్ష్మీ నాయుడు పాల్గొన్నారు.
News November 12, 2025
ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీ!

TG: ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయని తమ దృష్టికి రావడంతో వచ్చే ఏడాది నుంచి సీట్ల భర్తీని ఆన్‌లైన్ విధానంలో చేయాలని చూస్తోంది. దీంతో విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయకుండా అడ్డుకోవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 30వేలకు పైగా మేనేజ్‌మెంట్ సీట్లు ఉన్నాయి.
News November 12, 2025
త్వరలో రూ.10వేల పరిహారం: తుమ్మల

రాష్ట్రంలో మొంథా తుఫాన్ కారణంగా లక్షా 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. అత్యధికంగా నాగర్ కర్నూల్‌లో 23,580, వరంగల్‌లో 19,736 ఎకరాల నష్టం వాటిల్లినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందాన్ని పర్యటించమని కోరామన్నారు. దెబ్బతిన్న పంటలకు త్వరలోనే ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.


