News March 24, 2025
ధర్పల్లి: ‘పది’ పరీక్ష రాయాలంటే రూ.5 వేలు ఇవ్వాల్సిందే

ధర్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అక్రమాలకు తెరలేపినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల్లో కాపీ చేయాలంటే ఒక్కో విద్యార్థి రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని, తక్కువ ఇస్తే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు.
Similar News
News September 12, 2025
NZB: యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం: మంత్రి

రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం NZBరూరల్ MLAక్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ
రాష్ట్రానికి సరిపడినంత యూరియా పంపకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. స్టాక్ పంపాలని విన్నపాలు చేసినప్పటికీ అడపాదడపా యూరియా పంపుతూ ఇక్కడి రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు.
News September 12, 2025
సాయంత్రం 4 గంటలకు శ్రీరాంసాగర్ గేట్లు ఓపెన్

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వస్తున్న వరద ప్రవాహాన్ని శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత ఏ సమయంలోనైనా స్పిల్‌వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ జగదీశ్ తెలిపారు. ప్రాజెక్టు దిగువన ఉన్న గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పశువుల కాపరులు, మత్స్యకారులు, రైతులు నదిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
News September 12, 2025
KMR: యువకుడి మోసం.. యువతి ఆత్మహత్య

ప్రేమలో మోసపోయానని మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం సబ్దల్ పూర్‌లో బుధవారం జరిగింది. ఎస్సై బొజ్జ మహేష్ వివరాలు.. గ్రామానికి చెందిన సావిత్రి(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. శెట్టిపల్లి సంగారెడ్డికి చెందిన ప్రదీప్ ప్రేమ పేరుతో మోసం చేశాడని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.