News March 24, 2025

బాపట్ల: ’25 రోజులు పొడిగించాలి’ 

image

బీసీ కార్పొరేషన్ లోన్‌ల విధానాలలో కొన్ని సవరణలు చేయాలని బాపట్ల జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు కోరారు. ఈ మేరకు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెంకట్ మురళిని కలిసి వినతి పత్రం అందజేశారు. బీసీ కార్పొరేషన్ లోన్‌లకు గడువు కనీసం 25 రోజులు పొడిగించాలన్నారు. సచివాలయ సిబ్బందితో బీసీ కార్పొరేషన్ లోన్లు గురించి అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.

Similar News

News November 14, 2025

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి: SP

image

వాంకిడి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎఎస్పీ తనిఖీ చేసారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, తదితర విభాగాలను క్షుణ్నంగా పరిశీలించారు. SI మహేందర్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న కేసులపై సమీక్షా చేసి, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు అవసమైన చర్యలు చేపట్టాలని సూచించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.

News November 14, 2025

VZM: ‘మధుమేహంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు’

image

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన సదస్సులు, స్క్రీనింగ్ పరీక్షలను శుక్రవారం నిర్వహించినట్లు DMHO జీవనరాణి తెలిపారు. మొత్తం 44 కార్యాలయాల సిబ్బందికి టెస్టులు చేయడంతో పాటు, అన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధుమేహంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. మధుమేహంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

News November 14, 2025

పుట్టపర్తి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు

image

పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను ఈ నెల 17న తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించడానికి ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ కోరారు.