News March 24, 2025
VZM: ఈ నెల 25,26 తేదీల్లో APPSC పరీక్షలు

ఈ నెల 25,26 తేదీల్లో జరగనున్న APPSC పరీక్షలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని DRO ఎస్.శ్రీనివాసమూర్తి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, 25, 26 తేదీల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని అనలిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాలకు, 26న డిప్యుటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News April 10, 2025
VZM: రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీచర్ మృతి

పద్మానాభంకి చెందిన వి.రమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 11 గంటలకు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పనిమీద విజయనగరం బైక్‌పై వెళ్తుండగా చిన్నాపురం సమీపంలో మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనగా రమణ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన ఎస్.రాయవరం హైస్కూల్లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు.
News April 10, 2025
రేగిడి: పోక్సో కేసులో నలుగురి అరెస్ట్

విజయనగరం జిల్లా రేగిడి మండలానికి చెందిన జగదీశ్ ఈనెల 26న అదే మండలానికి చెదిన బాలికను ప్రేమ పేరుతో విజయవాడ తీసుకెళ్లిపోయాడు. బాలిక కనబడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడంతో జగదీశ్‌తో పాటు అతనికి సాయం చేసిన మరో ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు బుధవారం తెలిపారు.
News April 9, 2025
బొబ్బిలి రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

బొబ్బిలి రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు జీఆర్పీ హెచ్‌సీ ఈశ్వరరావు బుధవారం తెలిపారు. రెండో ప్లాట్‌ఫామ్‌పై మృతదేహం లభ్యమైందని చెప్పారు. మృతుడి ఆచూకీని తెలిపే ఎటువంటి ఆధారాలు తమకు దొరకలేదని అనారోగ్య కారణాలతో చనిపోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పడితే బొబ్బిలి రైల్వే పోలీసులను సంప్రదించాలని హెచ్‌సీ ఈశ్వరరావు కోరారు.