News March 24, 2025
నెల్లూరు: ఆన్‌లైన్‌లో పరిచయం.. రూ.18 లక్షల మోసం

హనీట్రాప్‌కు గురై ఓ వ్యక్తి రూ.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వరికుంటపాడుకు చెందిన తనకు ఆన్లైన్ ద్వారా దుర్గాభవాని అనే మహిళ పరిచయమైందని, అనారోగ్యంగా ఉందని నమ్మించి తన దగ్గర రూ.18 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని వాపోయాడు. ఈ మేరకు సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News March 29, 2025
రాష్ట్ర హైకోర్టు జడ్జితో జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు భేటీ

నెల్లూరు నగరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీనివాసరెడ్డిని శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్, నెల్లూరు ఆర్డీవో అనూష మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, నెల్లూరు ఆర్డీవోలు రాష్ట్ర హైకోర్టు జడ్జితో వివిధ అంశాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
News March 29, 2025
కబ్జా కోరల్లో బ్రిటిష్ కాలం నాటి మార్చురీ.?

ఉదయగిరి RTC డిపో సమీపంలో బ్రిటిష్ కాలం నాటి మార్చురీ భవనం కబ్జాకు గురైనట్లు స్థానికులు ఆరోపించారు. మార్చురీ భవనానికి సంబంధించిన స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కంప చెట్లను తొలగించి, చదును చేసి ఆక్రమించేందుకు హద్దు రాళ్లు ఏర్పాటు చేశారన్నారు. విషయం తెలుసుకున్న ఉదయగిరి CHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్.. ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించి రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News March 29, 2025
ఉగాది వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయండి

శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం తన చాంబర్లో ఉగాది వేడుక నిర్వహణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో ఉగాది వేడుక నిర్వహిస్తామన్నారు.