News March 24, 2025
తాడేపల్లిలో పామర్రు మహిళ దారుణ హత్య

ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసినదే. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారమై క్యాటరింగ్ పనులకు వెళ్తోంది. లక్షీ తిరుపతమ్మ ఆదివారం విజయవాడలో క్యాటరింగ్ పనికి వెళ్తున్న క్రమంలో హత్యకు గురైంది.
Similar News
News January 24, 2026
కృష్ణా: ద్విచక్ర వాహనదారులకు కలెక్టర్ సూచనలు

కలెక్టర్ డీకే బాలజీ శనివారం ఉదయం మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మూడు స్తంభాల సెంటర్ వద్ద స్వయంగా తనిఖీలు చేపట్టిన ఆయన, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు జరిమానాల కంటే ముందు ప్రాణ రక్షణ పట్ల అవగాహన కల్పించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం ఆయన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌లు అందజేశారు.
News January 24, 2026
26న జరిగే పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన కలెక్టరేట్‌లో నిర్వహించనున్న PGRSను రద్దు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం తెలిపారు. అధికారులంతా ఆ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న నేపథ్యంలో రద్దు చేసినట్లు చెప్పారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో నిర్వహించే PGRSను కూడా రద్దు చేసినట్లు SP విద్యాసాగర్ వెల్లడించారు.
News January 23, 2026
కృష్ణా: జెడ్పీలో 25 మందికి పదోన్నతులు

జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 25 మంది జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు పదోన్నతి కల్పించారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన వారికి జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. జెడ్పీ హైస్కూల్స్‌లో 20 మంది, ఎంపీడీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఐదుగురు టైపిస్ట్‌లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించినట్లు ఆమె తెలిపారు.


