News March 24, 2025
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: ఏసర్ ఇండియా

తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఓ పెయిడ్ లీవ్ ఇవ్వనున్నట్లు ఏసర్ ఇండియా వెల్లడించింది. మాతృక పేరిట ప్రతి నెలా ఈ సెలవును అందిస్తామని తెలిపింది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. L&T, స్విగ్గీ, జొమాటో కూడా ఈ తరహా లీవ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిహార్, ఒడిశా, సిక్కిం, కేరళ ప్రభుత్వాలు సైతం ఈ సెలవును అమలు చేస్తున్నాయి.
Similar News
News January 16, 2026
ఒంగోలు: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి

మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మనపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతిచెందాడు. నెల్లూరుకు చెందిన మైనార్టీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ జాఫర్ షరీఫ్(54) కారులో విజయవాడ నుంచి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. జాఫర్ షరీఫ్‌ను ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.
News January 16, 2026
మీరు పాలించడానికి అర్హులేనా?: జగన్

AP: గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో YSRCP కార్యకర్త మందా సాల్మన్ హత్యకు TDP వర్గీయులే కారణమని మాజీ CM జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ‘రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు? మీరు పాలించడానికి అర్హులేనా?’ అంటూ CM చంద్రబాబును ప్రశ్నించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారని, అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపడం దుర్మార్గమని మండిపడ్డారు.
News January 16, 2026
స్పీకర్‌కు ఇదే చివరి అవకాశం: సుప్రీంకోర్టు

TG: BRS MLAల పార్టీ ఫిరాయింపు కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్‌కు ఇదే చివరి అవకాశమని వ్యాఖ్యానించింది. ‘ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు ఉంటాయి. మిగిలిన ముగ్గురు MLAలపై నిర్ణయం తీసుకోండి’ అని ఆదేశించింది. ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు స్పీకర్ 4 వారాల టైమ్ కోరగా 2 వారాల్లో ప్రగతి చూపిస్తే 4 వారాల సమయం ఇస్తామని SC తెలిపింది.


