News March 24, 2025
కృష్ణాజిల్లాలో పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతం

కృష్ణాజిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. జిల్లాలో 21,771 మంది విద్యార్థులకు గాను 21,419 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News March 31, 2025
అవనిగడ్డ: హైవేపై రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

అవనిగడ్డ మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగడ్డ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తెనాలి వైపు నుంచి మోపిదేవికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అవనిగడ్డ సీఐ, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 31, 2025
కోడూరు: బాలికపై అనుచిత ప్రవర్తన..పోక్సో కేసు నమోదు

కోడూరులో ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వరికూటి వేణు అనే వ్యక్తి, బాలిక ఇంట్లో ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించగా, భయంతో బాలిక బయటకు పరుగెత్తింది. ఈ విషయాన్ని తల్లికి తెలపడంతో పెద్దలు రంగ ప్రవేశం చేశారు. అయితే, 2 రోజుల పాటు విషయం బయటకు రాకుండా చూసిన పెద్దలు, చివరికి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది.
News March 31, 2025
కృష్ణా: నేటి ‘మీకోసం’ కార్యక్రమం రద్దు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే కార్యక్రమం రద్దయినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే అర్జీ దారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి ‘మీకోసం’ కార్యక్రమం వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.