News March 24, 2025
దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బాపట్ల ఎంపీ సమీక్ష

బాపట్ల ఎంపీ, పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ సోమవారం ఢిల్లీలో దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గంలోని 62 లెవెల్ క్రాసింగ్ స్థితిని సమీక్షించారు. ప్రజలు ప్రమాదాలు, అసౌకర్యాలకు గురికాకుండా ఉండటానికి 62 ఆర్ఓబీలు, ఆర్‌యూబీల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరినట్లు ఎంపీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
Similar News
News January 16, 2026
రేపు మేడారం ట్రస్ట్ బోర్డు ఛైర్‌పర్సన్ ప్రమాణస్వీకారం

మేడారం ట్రస్ట్ బోర్డ్ ఛైర్‌పర్సన్‌గా తాడ్వాయి మండలానికి చెందిన ఈర్పా సుకన్యను ప్రభుత్వం నామినేట్ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు మేడారంలోని సమ్మక్క భవన్‌లో ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 16, 2026
జగిత్యాల కలెక్టరేట్‌లో విద్యా ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌లో TGMREIS ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ టి. సుచిత్ర పాల్గొని, అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 16, 2026
కౌన్సిలింగ్ కోసం AP RCET అభ్యర్థుల ఎదురుచూపులు

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో PhD ప్రవేశాల కోసం గత ఏడాది నవంబర్‌లో తిరుపతి SPWU ఆధ్వర్యంలో AP RCET పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 15న ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు విడుదలై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కౌన్సిలింగ్ తేదీలు ఎప్పుడు వస్తాయేమో అని అర్హత సాధించిన అభ్యర్థులకు ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి AP RCET కౌన్సిలింగ్, అడ్మిషన్లు చేపట్టాలని కోరుతున్నారు.


