News March 24, 2025
ఆత్మకూరు: క్షణికావేశం.. తీరని శోకం..!

జూరాల ప్రాజెక్టులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటక, బీజాపూర్‌కు చెందిన సుజయ్ కులకర్ణి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2 నెలల క్రితం పెళైంది. గత శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు వచ్చి వారి నాన్నకి ఫోన్ చేసి తాను ఇక్కడ ఉన్నట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Similar News
News February 28, 2026
జడ్చర్ల: పుట్టెడు దుఃఖంలో ఆ కుటుంబం.. దొంగల నిలువు దోపిడీ

జడ్చర్ల మండలం మల్లేబోయిన్‌పల్లికి చెందిన లక్ష్మి భర్త ఇటీవల చనిపోవడంతో దేవుని వద్ద నిద్ర చేసేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. లక్ష నగదు, 8 తులాల బంగారం, కిలో వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఇంటి పెద్ద మృతితో దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఈ చోరీ తీరని నష్టాన్ని మిగిల్చింది. చోరీపై పోలీసులు విచారణ చేపట్టారు.
News February 28, 2026
MBNR: రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత: ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదని, ప్రతి పౌరుడు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మావతి, సీఐలు శ్రీనివాస్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
News February 27, 2026
పాలమూరు: హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

TGSC స్టడీ సర్కిల్‌లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్ నగర్‌లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి1న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.


