News March 24, 2025
‘ఉమ్మడి MBNR జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మించండి’

దిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మించాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో పెద్ద విస్తీర్ణం గల జిల్లా మహబూబ్నగర్ అని గుర్తు చేసి, ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మించడంతో రవాణా సౌకర్యం, ప్రజలకు ఉపాధి లభిస్తుందని కోరారు.
Similar News
News December 26, 2025
MBNR: ప్రజా భద్రతే లక్ష్యం: ఎస్పీ

MBNR జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని, గత ఏడాదితో పోలిస్తే నేరాలు 5 శాతం తగ్గాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 2025 వార్షిక నేర నివేదికను ఆమె విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీ భద్రతతో ప్రశాంతంగా నిర్వహించామన్నారు. మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా కేంద్రాల భద్రత కల్పిస్తున్నామన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్నారు.
News December 26, 2025
MBNR: నేడు వార్షిక నేర నివేదిక విడుదల

మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి సమావేశం నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ రిలేషన్స్ అధికారి (పీఆర్ఓ) శ్రీనివాసులు “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 వార్షిక నేర నివేదిక (Annual Crime Review) అన్యువల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మీడియా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
News December 25, 2025
MBNR: రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్.. రన్నర్‌గా పాలమూరు

రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మెదక్‌లోని మనోహరాబాద్‌లో నిర్వహించారు. ఈ టోర్నీలో మహబూబ్‌నగర్ బాలికల జట్టు రన్నర్స్ (2వ స్థానం)లో నిలిచిందని జిల్లా సాఫ్ట్ బాల్ అధ్యక్షుడు అమరేందర్ రాజు ‘Way2News’ప్రతినిధితో తెలిపారు. బాలికల విజయం పట్ల సంఘం సభ్యులు రాఘవేందర్, నాగరాజు, ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోచ్, మేనేజర్‌గా లక్ష్మీనారాయణ, సునీత వ్యవహరించారు.


