News March 24, 2025
చిన్నగంజాంలో బాపట్ల జేసీ పర్యటన

చిన్నగంజాం మండలంలోని పెదగంజాం గ్రామ పరిధిలోని కొత్త గొల్లపాలెం గ్రామానికి సీఎం చంద్రబాబు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం హెలికాప్టర్ దిగడానికి నిర్మించనున్న హెలిప్యాడ్ ప్రాంతాన్ని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకార్ జైన్ సోమవారం సందర్శించారు. పర్చూరు MLA ఏలూరి సాంబశివరావు, పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.
Similar News
News July 9, 2025
రేపు తల్లిదండ్రులు ఆడే ఆటలు ఇవే..

జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 1,810 ప్రభుత్వ, 558 ప్రైవేటు స్కూల్స్, 140 జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు మెగా PTM జరుగుతుందన్నారు. వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులకు లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు ఉంటాయన్నారు.
News July 9, 2025
14న భూపాలపల్లిలో అప్రెంటిస్‌షిప్ మేళా

ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా(PMNAM)ను ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 14న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న వారు తప్పనిసరిగా www.apprenticeshipindia.gov.in పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
News July 9, 2025
NZB: రైతుల్లో చిగురించిన ఆశలు..!

NZB జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొంతమంది రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది 4,36,101.21 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 4,37,135 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేటి వరకు 2,37,372 ఎకరాల్లో (58%) నాట్లు వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.