News March 24, 2025
KTDM: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ పెంపు

రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ ఈనెల 31కి పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడు నెలలు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని పెంచింది. దీంతో జూన్ చివరిదాకా అక్రిడేషన్ కార్డులు చెల్లుబాటు కానున్నాయి. అక్రిడేషన్ కార్డులను ఆయా జిల్లాల డీపీఆర్ఓల వద్ద మూడు నెలలు పొడగింపుకు సంబంధించిన స్టిక్కర్‌తో బస్సు పాసులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
Similar News
News March 29, 2025
తమన్నాతో బ్రేకప్ వార్తలు.. విజయ్ వర్మ కామెంట్స్ వైరల్

నటి తమన్నా, విజయ్ వర్మ విడిపోయారని కొన్ని రోజలుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో రిలేషన్‌షిప్‌ను ఓ ఐస్‌క్రీమ్‌లా ఆద్యంతం ఆస్వాదించాలని, అలా చేస్తే సంతోషంగా ఉండగలమని విజయ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. సంతోషం, బాధ, కోపం లాంటి ప్రతి అంశాన్ని స్వీకరించి ముందుకు సాగాలని చెప్పారు. మరోవైపు, ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూడటం మొదలెడతామో అప్పుడే అసలు సమస్యలొస్తాయని తమన్నా ఇటీవల వ్యాఖ్యానించారు.
News March 29, 2025
చిత్తూరు జిల్లా ప్రథమ స్థానం: కలెక్టర్

చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో, ఎన్‌ఇసిసి సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతాంగం వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమపై ఎక్కువ మంది రైతులు ఆధారపడి ఉన్నారన్నారు.
News March 29, 2025
సంగారెడ్డిలో దివ్యాంగులకు అవగాహన సదస్సు

ఏప్రిల్ 3 సంగారెడ్డి కలెక్టర్ ఆడిటోరియంలో దివ్యాంగుల అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికి యుడిఐడి కార్డు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. కావున జిల్లాలోని దివ్యాంగులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల దివ్యాంగుల సంఘాల నాయకులు హాజరు కావాలన్నారు.