News March 24, 2025

నాడు మోదీ చెప్పారు.. నేడు అమరావతిలోనూ అదే దోపిడీ: YCP

image

AP: అమరావతిలో రూ.27,159 కోట్ల విలువైన కాంట్రాక్టులను 3.94-4.34% అధిక ధరకు సొంత మనుషులకు CBN కేటాయించారని YCP ఆరోపించింది. ‘పోలవరాన్ని చంద్రబాబు ATM మాదిరి వాడుకుంటున్నారని మోదీ ఏ క్షణాన అన్నారో కానీ నేడు అమరావతిలోనూ అదే జరుగుతోంది. అప్పు తెచ్చిన డబ్బంతా అమరావతిలో పోసి 59 ప్యాకేజీల పనులను తమవాళ్లకు ఇచ్చుకున్నారు. అందులో కమీషన్లు నొక్కుతూ చంద్రబాబు సంపన్నుడు అవుతున్నారు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News January 11, 2026

బంగారం ధర రూ.2 లక్షలకు చేరనుందా?

image

2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు 2026లోనూ అదే పంథా కొనసాగించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,500 డాలర్లు ఉంది. ఇది మార్చి నాటికి 5,000 డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నట్లు HSBC కమోడిటీ పేర్కొంది. ఇక దేశీయంగా 10  గ్రాముల బంగారం ధర ఇప్పటికే రూ.1.41 లక్షల వద్ద ఉండగా, జూన్‌ నాటికి రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

News January 11, 2026

ఇరాన్ స్వేచ్ఛ కోరుకుంటోంది: ట్రంప్

image

ఇరాన్‌లో తీవ్ర <<18730445>>నిరసనలు<<>> కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజలు ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా స్వేచ్ఛను కోరుకుంటున్నారని, వారికి సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. నిరసనకారులను అణచివేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే USA చూస్తూ ఊరుకోదని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు.

News January 11, 2026

సంక్రాంతి సందడి.. హోటళ్లు హౌస్‌ఫుల్

image

AP: గోదావరి జిల్లాల్లో సందడి సంక్రాంతి మొదలైంది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జిలు హౌస్‌ఫుల్ అయిపోయాయి. కోడిపందేల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు. పందేల బరులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ యజమానులు గదుల అద్దెను మూడు రోజులకు రూ.30-60 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.